వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించద్దంటూ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు షర్మిల. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం స్టే విధిస్తూ తీర్పునిచ్చింది.ఈ క్రమంలో సుప్రీమ్ తీర్పుపై షర్మిల తన ఎక్స్ ( ట్విట్టర్ ) ద్వారా స్పందించారు.
దురాత్ముల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా, మాడుపగిలేలా, వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో నిన్న సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని అన్నారు షర్మిల. భావప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షసమూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి, ఎప్పటికైనా ధర్మపోరాటంలో చివరికి న్యాయమే గెలుస్తుందని సుప్రీమ్ తీర్పుతో ప్రూవ్ అయ్యిందని జగన్ అండ్ కోను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.ఈ విజయం తొలి అడుగు మాత్రమే అని, రాబోయే రోజుల్లో వివేకకానంద రెడ్డి గారి కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉధృతం చేస్తామని అన్నారు.చిట్టిచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తామంటూ షర్మిల చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.