కేరళలో సంచలనం సృష్టించిన షారన్ రాజ్ హత్య కేసులో నిందితురాలు గ్రీష్మకు కేరళ కోర్టు మరణశిక్ష విధించింది. 2022 అక్టోబర్‌లో ప్రియుడు షరోన్ రాజ్‌కు విషమిచ్చి హత్య చేసినందుకు దోషిగా తేలిన గ్రీష్మకు మరణశిక్ష విధించింది.
అంతేగాకుండా సాక్ష్యాలను నాశనం చేసినందుకు ఆమె మామ నిర్మల్ కుమార్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.అయితే ఆమె తల్లి సింధును నెయ్యట్టింకర కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఇది అరుదైన కేసని..అందువల్ల ఆమె వయసును పరిగణలోకి తీసుకోలేమని చెబుతూ మరణశిక్ష విధించింది.జనవరి 17న గ్రీష్మను దోషిగా నిర్ధారించిన తిరువనంతపురం అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్.. జనవరి 20న తీర్పు వెల్లడించింది.
Also Read :- నా కొడుకు మృతదేహాన్నిఇండియాకు తెప్పించండి
కేరళలోని పరశాలలోని తిరువనంతపురం శివారు ప్రాంతానికి చెందిన షరోన్ రాజ్2022 అక్టోబర్ 25న మరణించాడు. అయితే అతని మృతిపై విచారించగా విషప్రయోగం చేసినట్లు తేలింది. గ్రీష్మ తన ప్రియుడు షరోన్‌తో రిలేషన్‌షిప్ ను బ్రేక్ చేయడానికి పక్కా ప్లాన్ ప్రకారం ఈ దారుణానికి ఓడిగట్టింది. 2022 అక్టోబరు 14న తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని రామవర్మంచిరైలో ఉన్న తన ఇంటికి గ్రీష్మ షారోన్‌ను రప్పించి విషం కలిపిన ఆయుర్వేద డ్రింక్ ను అతనికి ఇచ్చింది.
గ్రీష్మ తల్లిదండ్రులు ఆమెకు మరొకరితో వివాహం నిశ్చయించడంతో అతన్ని వదిలించుకోవడానికి ఆమె అలా చేసింది. విష ప్రయోగం జరగడంతోనే షారోన్ అవయవాలు క్షీణించి చనిపోయాడాని డాక్టర్లు తేల్చారు. అప్పట్లో ఈ ఘటన సంచలనం రేపింది. దీంతో 2022 అక్టోబర్ 31న గ్రీష్మ, ఆమె మేనమామ,తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో కోర్టులో వాదోపవాదనల తర్వాత కోర్టు 2025 జనవరి 20న గ్రీష్మకు ఆమె మేనమామకు శిక్ష విధించింది. తల్లిని నిర్దోషిగా పరిగణిస్తూ తీర్పునిచ్చింది