
హైదరాబాద్, వెలుగు: జపాన్ కంపెనీ షార్ప్ బిజినెస్ సిస్టమ్స్ (ఇండియా) ఎయిర్ కండిషనింగ్ ( ఏసీ) టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలను డెవలప్ చేశామని ప్రకటించింది. రీర్యూ, సీర్యో, ప్లాస్మా చిల్ సిరీస్‌లలో భారతీయ మార్కెట్లోకి అడుగుపెడుతున్నామని పేర్కొంది. ఈ ఏసీల్లో 7 -దశల్లో వడపోత, సొంతంగా క్లీన్ చేసుకోగలగడం వంటి టెక్నాలజీలు ఉన్నాయి. ‘భారతదేశం షార్ప్‌కు కీలకమైన మార్కెట్. ఇక్కడ మా బిజినెస్‌ను బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాం’ అని కంపెనీ ఎండీ ఒసాము నరిటా అన్నారు.