హద్దులు దాటేస్తున్న శర్వా 35 బడ్జెట్!.. సాహసం చేస్తున్న ఆ ప్రొడ్యూసర్స్ ?

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్స్ లలో శర్వానంద్(Sharwanand) ఒకరు. డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న మూవీలో  శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ(Peoplemediafactory)  బ్యానర్ పై వివేక్, విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

శర్వాకి జోడీగా ఉప్పెన క్యూటీ కృతి శెట్టి(KrithiShetty) హీరోయిన్ గా సెలెక్ట్ అయింది..ప్రసెంట్ హీరో శర్వా, కృతి ఇద్దరు ప్లాప్స్తో సతమవుతున్నారు. మరి ఫస్ట్ టైం వీరిద్దరూ కలిసి నటిస్తున్న మూవీ కావడంతో.. ఎలాగైనా హిట్ కొట్టాలనే కాన్ఫిడెన్స్తో ఉన్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి కమర్షియల్ టాక్ ఒకటి వినిపిస్తోంది. అదేంటంటే..ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి..మేకర్స్ ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే రెండింతలు ఎక్కువ అయిందని సమాచారం. ఈ మూవీ ఇంకా 30 శాతం పెండింగ్ లో ఉండగానే..ఇంతటి టాక్ వినిపిస్తే..మరి మూవీ కంప్లీట్ అయ్యే సమయానికి 40 నుంచి 50 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశాలు ఉంటాయని టాక్ వినిపిస్తోంది.

ఏదీ ఏమైనప్పటికీ..ప్రస్తుతం శర్వానంద్తో.. ఇంత బడ్జెట్లో సినిమా తీస్తున్నారంటే..ప్రొడ్యూసర్స్ సాహసం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే శర్వా గత చిత్రాలు చూసుకుంటే యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన మహా సముద్రం, ఫ్యామిలీ కంటెంట్తో చేసిన ఆడాళ్ళు మీకు జోహార్లు.. సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో శర్వాపై ఉన్న క్రేజీ.. ఆడియన్స్ కు  దూరమయిన ఫీలింగ్ కలిగిస్తోంది. 

మరి శ్రీరామ్ ఆదిత్య తో చేసే సినిమా కథలో కంటెంట్ ఉండి, ముందుగా రీలీజ్ అయ్యే టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో హైప్ క్రియేట్ చేస్తే తప్ప..అంత త్వరగా ప్రేక్షకుల్లోకి వెళ్లడం కష్టమని సినీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తీసిన మూడు సినిమాలు..అంత గొప్ప రికార్డులు సృష్టించినవి అయితే కాదు. మరి జరిగే వండర్ ఏంటనేది ట్రైలర్ రిలీజ్ అయితే తప్ప..ఓ అంచనాకి రాలేమనే మాట ఆడియన్స్ లో బలంగా ఉంది. 

ఇక ఈ మూవీ విషయానికి వస్తే..

ALSO READ :- తిండేమో రోజుకు 8 కిలోలు తింటారు: పాక్ ఆటగాళ్లను బండబూతులు తిడుతున్న మాజీలు

శర్వా 35 వర్కింగ్ టైటిల్తో వస్తోన్న ఈ మూవీకి బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ సెలెక్ట్ చేసినట్లు సమాచారం. అలాగే లేటెస్ట్ మ్యూజిక్ సెన్సషన్ హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన ట్యూన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో శర్వా 35 నుంచి ఆఫీషయల్ టైటిల్ ప్రకటనతో పాటు టీజర్ అప్‌డేట్‌ ఉంటుందని సమాచారం. అబ్దుల్ వాహబ్ నుంచి వచ్చిన ఖుషి మూవీ సాంగ్స్ చార్ట్ బ్లాస్టర్గా నిలిచినా విషయం తెలిసందే. దీంతో అబ్దుల్ వాహబ్ ఈ సినిమాకి మేజర్ అట్రాక్షన్ గా మారబోతున్నారు. ఇక ఈ చిత్రానికి DOP విష్ణు శర్మ, ఎడిటర్గా ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ గా జానీ షేక్ వర్క్ చేయబోతున్నారు.