Sharwanand: కూతురిని పరిచయం చేసిన శర్వానంద్..ఇలాంటి పేరు పెట్టడం గ్రేట్ అన్న

Sharwanand: కూతురిని పరిచయం చేసిన శర్వానంద్..ఇలాంటి పేరు పెట్టడం గ్రేట్ అన్న

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా శుభవార్తలు వినిపిస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ (Ram charan) ఉపాసన(Upasana)కు కూతురు పుట్టగా..రీసెంట్గా నిఖిల్ సిద్ధార్ధ్కు కొడుకు పుట్టాడు. ఇక తాజాగా టాలీవుడ్ హీరో శర్వానంద్ (Sharwanand) తండ్రయ్యాను అంటూ గుడ్ న్యూస్ చెప్పారు. గతేడాది జూన్ నెలలో శర్వానంద్ రక్షితా రెడ్డి (Rakshitha reddy) వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు  అధికారికంగా ప్రకటించారు.

శర్వా తన సోషల్ మీడియాలో ఫొటోస్ను షేర్ చేస్తూ..తన కూతురు పేరు 'లీలా దేవి మైనేని' (Leela Devi) అని రివీల్ చేశాడు. శర్వా పంచుకున్న ఫొటోలో వైట్ డ్రెస్లో శర్వా దంపతులు..చిన్నారి ఎంతో అద్భుతంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే..శర్వా పుట్టినరోజున..తనకు కూతురు పుట్టిందని చెప్పడం..ఈ కాలంలో కూడా అచ్చతెలుగు పేరు పెట్టడం చాలా బావుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన మనమే మూవీ రిలీజ్ కు రెడీ ఉంది. అలాగే లూజర్ వెబ్ సీరిస్ డైరెక్టర్ అభిలాష్ తో స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక మూవీ చేస్తున్నాడు. సామజవరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజ్ తో మరో మూవీ చేస్తున్నాడు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sharwanand (@imsharwanand)