ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో శర్వానంద్.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టును మొదలుపెట్టాడు. సంపత్ నంది దర్శకత్వంలో కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 38వ చిత్రమిది.
ఇదొక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా. 1960 తెలంగాణ- సరిహద్దులో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలియజేశారు. దీనికోసం హైదరాబాద్ శివారులోని 15 ఎకరాల్లో సెట్ సిద్ధం చేస్తున్నారు. బుధవారం (అక్టోబర్ 16న) భూమి పూజతో సెట్ వర్క్‌ను ప్రారంభించారు మేకర్స్.
ఉత్తర తెలంగాణ స్వరూపాన్ని, కల్చర్‌ని రీ క్రియేట్ చేసేలా సెట్‌ని రెడీ చేస్తున్నట్టు తెలియజేశారు. 60ల నాటి పాత్రను పోషించడానికి శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు.
Bringing our dream n world alive.. piece by piece..#Bhoomipuja of #Sharwa38 🧱
— Sampath Nandi (@IamSampathNandi) October 16, 2024
🤗🙏🏾
The divine force is wid us… shower us some love too 🫶🏽🙏🏾
A #SharwaSampathBloodFest 🔥
Charming star @ImSharwanand @KKRadhamohan #BheemsCeciroleo @soundar16 @KirankumarMann4 @SriSathyaSaiArt pic.twitter.com/oxTAGJrDpF
ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
Beyond your imaginations..
— Sampath Nandi (@IamSampathNandi) September 19, 2024
Beyond my limits..
You will remember this world for longggggg💥
A #SharwaSampathBloodFest 🗡️🔥@ImSharwanand @IamSampathNandi @KKRadhamohan @soundar16 #BheemsCeciroleo @KirankumarMann4 #RameshKothapalli @SriSathyaSaiArt https://t.co/BEm5WiqIPC