
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. లేటెస్ట్గా శర్వా నుంచి మరో క్రేజీ ప్రాజెక్టు అప్డేట్ వచ్చింది. సంపత్ నంది దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 38వ చిత్రమిది.
నేడు (ఏప్రిల్ 30న) శర్వా 38 నుంచి టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా సినిమాకు ‘భోగి’ (Bhogi)అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ వీడియో షేర్ చేశారు. ‘‘ప్రతి రక్తపు చుక్కకు ఒక కారణం ఉంటుంది. ప్రతి పండగకు ఓ ప్రయోజనం ఉంటుంది’’ అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు డైరెక్టర్ సంపత్ నంది.
ఇదొక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా. 1960 తెలంగాణ- సరిహద్దులో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలియజేశారు. ఈ మూవీలో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటించనున్నారు.
ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌గా, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.
శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే:
ప్రస్తుతం శర్వానంద్ యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తోన్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీని అభిలాష్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో శర్వానంద్ బైక్ రైడర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
►ALSO READ | HIT 3 Ticket Prices: పెరిగిన హిట్ 3 టికెట్ల ధరలు.. ప్రభుత్వం ఎంత పెంచిందంటే?
అలాగే, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ‘నారీ నారీ నడుమ మురారి’ అనే మూవీ చేస్తున్నాడు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.