Maname Trailer: పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు.. ఆసక్తిరేపుతున్న మనమే మూవీ ట్రైలర్

టాలీవుడ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మనమే. దర్శకుడు శ్రీరామ్ ఆధిత్య తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వాహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు, టీజర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా జూన్ 7న విడుదలవుతున్న నేపధ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మనమే మూవీ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. 

Also Read:సాలిడ్ కంబ్యాక్.. ఈ సంవత్సరం ఐదు సినిమాలతో వస్తున్నా!

మనమే సినిమా ట్రైలర్ చాలా రెఫ్రెషింగ్ గా ఉంది. సరికొత్త కథతో వస్తున్నట్టుగా కూడా అర్థమవుతోంది. ట్రైలర్ మొత్తం కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో నింపేశాడు దర్శకుడు. శర్వానంద్ కూడా స్టైలీష్ లుక్ లో చాలా బాగా కనిపిస్తున్నాడు. ఇక హీరోయిన్ కృతి కూడా చాలా అందంగా ఆకట్టుకుంది. ఇక ట్రైలర్ లో పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు అనే ఎలిమెంట్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసింది. 

అంతేకాదు.. ట్రైలర్ లో కనిపిస్తున్న ఆ చిన్న పిల్లాడు ఎవరు? ఆ పిల్లాడికి శర్వా, కృతికి సంబంధం ఏంటి? అతను వీళ్ళ దగ్గర ఎందుకు ఉన్నారు? వాళ్లిద్దరూ కలిసి ఎందుకు ఉన్నారు? అనేది సస్పెన్స్ గా మారింది. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జూన్ 7వరకు ఆగాల్సిందే. ఇవన్నీ చూస్తుంటే.. చాలా గ్యాప్ తరువాత అటు శర్వా, ఇటు కృతి హిట్టు కొట్టేలాగే కనిపిస్తున్నారు.