యంగ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్(Sharwanand), కృతిశెట్టి(Krithi Shetty) జంటగా, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా జూన్ 7 న థియేటర్లలో రిలీజై ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కథా నేపథ్యం, శర్వానంద్, కృతిశెట్టి నటన, కామెడీ, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకున్నాయి.
అయితే, మేకర్స్ అంచనాలకు తగ్గట్టుగా భారీ కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ఈ ఫ్యామిలీ రొమాంటిక్ డ్రామా థియేటర్లలో రిలీజై ఐదు నెలల కావొస్తున్నా ఓటీటీలోకి ఇంకా రాలేదు. ఆ మధ్య డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్కు వస్తుందనే వార్తలు వినిపించిన ఇప్పటికీ స్ట్రీమింగ్ కు రాకపోవడం ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేస్తోంది. ఇక లేటెస్ట్ ఓటీటీ అప్డేట్ ప్రకారం ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి వచ్చేస్తుందట. అది ఎప్పుడు.. ఎక్కడ అనే వివరాలు చూసుకుంటే..
శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన మనమే మూవీ ఓటీటీ అడ్డంకులు తొలగిపోయినట్లు సమాచారం. ఈ మూవీ డిసెంబర్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై మేకర్స్ నుంచి త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.
అసలు వివాదమేంటి::
మనమే మూవీ ఆగస్ట్‌లోనే ఓటీటీ ఆడియన్స్ ను పలకరించే అవకాశం ఉండేది. కానీ నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో నెలకొన్న వివాదం కారణంగా ఓటీటీ రిలీజ్ వాయిదాపడుతూ వచ్చింది. ఈ క్రమంలో మనమే ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మనమే మూవీ ఓటీటీ, శాటిలైట్ హక్కులను కొన్నవారు తమకు డబ్బులు చెల్లించలేదని, వారి మోసంపై కోర్టును ఆశ్రయించినట్లు' తెలిపాడు. ఇలా ఇపుడీ ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. అన్నీ ఒకే అయితే.. డిసెంబర్ ఫస్ట్ వీక్లో శర్వానంద్ మూవీ ఓటీటీ ఆడియన్స్ను ఎంటర్టైన్ చేయనుంది.
మనమే తర్వాత హీరో శర్వానంద్ యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తోన్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీతో అభిలాష్‌రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో శర్వానంద్ బైక్ రైడర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
కథ:
విక్రమ్(శర్వానంద్) లండన్ లో అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ ఏపని లేకుండా లైఫ్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతని ప్రాణ స్నేహితుడు అనురాగ్ ఫ్యామిలీ యాక్సిడెంట్ లో చనిపోవడంతో..వాళ్ళ కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) బాధ్యత విక్రమ్ తీసుకోవాల్సి వస్తుంది. విక్రమ్, ఖుషీ మధ్యలోకి సుభద్ర (కృతిశెట్టి) కూడా వస్తుంది. మరి ఖుషి బాగోగులు చూసుకునే క్రమంలో విక్రమ్ కు తెలిసిన విషయాలు ఏంటి? ఖుషీకి సుభద్రకు ఉన్న లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ.