Manamey Movie Review: మనమే మూవీ రివ్యూ.. శర్వా హిట్టు కొట్టాడా?

Manamey Movie Review: మనమే మూవీ రివ్యూ.. శర్వా హిట్టు కొట్టాడా?

ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మనమే. ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నేడు(జూన్ 7) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా కథ ఏంటి? ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? చాలా గ్యాప్ తరువాత శర్వానంద్ హిట్ కొట్టాడా? అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:
విక్రమ్(శర్వానంద్) లండన్ లో అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ ఏపని లేకుండా లైఫ్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతని ఫ్రెండ్ ఫ్యామిలీ యాక్సిడెంట్‌ లో చనిపోవడంతో..  వాళ్ళ కొడుకు ఖుషి (విక్రమ్ ఆదిత్య) బాధ్యత విక్రమ్ తీసుకోవాల్సి వస్తుంది. విక్రమ్, ఖుషీ మధ్యలోకి సుభద్ర (కృతిశెట్టి) కూడా వస్తుంది. మరి ఖుషి బాగోగులు చూసుకునే క్రమంలో విక్రమ్ కు తెలిసిన విషయాలు ఏంటి? ఖుషీకి సుభద్రకు ఉన్న లింక్ ఏంటి? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ:
మనమే.. రొటీన్ కథతో వచ్చిన ఎంటర్టైనర్. చాలా ఎమోషనల్ గా ఉండనుందని మేకర్స్ ముందునుండి చెప్పుకొచ్చారు కానీ, ఆ ఎమోషన్ సినిమాలో కనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ ఇంట్రో, చిన్న పిల్లాడి పేరెంట్స్ మరణానికి కారణం తెలుసుకోవడం, వారి భాద్యత హీరోహీరోయిన్ తీసుకోవడం ఆలా అలా జరిగిపోతుంది. అక్కడి వరకు ఓ మోస్తారుగా నడిచినా.. సెకండ్ హాఫ్ మాత్రం అస్సలు ఎంగేజింగ్ గా ఉండదు. సీన్స్ అన్నీ అలా అలా వస్తూనే ఉంటాయి. ప్రేక్షకులు ఒకింత కన్ఫ్యూజన్ కి లోనవుతారు. దాంతో సాగదీతగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా ముందుగానే ఊహించేయొచ్చు. 

నటీనటులు, సాంకేతిక నిపుణులు:
విక్రమ్‌ పాత్రకు శర్వానంద్ న్యాయం చేశాడు. చాలా అందంగా, కలర్ ఫుల్ గా కనిపించాడు. ఇక సుభద్ర పాత్రలో కృతిశెట్టి పర్వాలేదనిపించింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఖుషి పాత్రలో పిల్లాడి హావభావాలు కూడా బాగున్నాయి. మిగతా నటీనటులు కూడా పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.

మనమే సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అంటే విష్ణు శర్మ అందించిన సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. సినిమా చాలా కలర్‌ఫుల్‌గా, లండన్‌ లొకేషన్స్‌ని అద్భుతంగా క్యాప్చర్ చేశారు. హేషామ్ అందించినా పాటలు పెద్దగా లేకపోయినా.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య కథపై, ఎమోషన్స్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

మొత్తంగా మనమే సినిమా విషయానికి వస్తే.. రొటీన్ కథ.. అలాగే ప్రెసెంట్ చేశారు.