
శర్వానంద్ హీరోగా రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్స్. బుధవారం ఈ చిత్రం నుంచి ‘దర్శనమే’ అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేశారు. విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన మెలోడీ సాంగ్‌ను యాజిన్ నిజార్ పాడాడు.
దర్శనమే.. మధుర క్షణమే.. నీవు, నేను ఇక మనమే.. మనసున మోగే మంగళ నాదస్వరమే.. నాదాక నిన్ను నడిపింది ప్రేమే.. నువ్విలా జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే..”అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం ఆకట్టుకుంది. పాటలో శర్వా, సంయుక్త జంట కెమిస్ట్రీ ఇంప్రెస్ చేసింది.