ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న శర్వానంద్.. గురువారం మరో క్రేజీ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. సంపత్ నంది దర్శకత్వంలో కెకె రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 38వ చిత్రమిది. ఇదొక రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ యాక్షన్ డ్రామా. 1960 తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్టు తెలియజేశారు.
దీనికోసం శర్వానంద్ సరికొత్త మేకోవర్‌లో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో మంటలు చెలరేగుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా ఉంది. గ్రిప్పింగ్ యాక్షన్, ఎమోషనల్ సీక్వెన్స్‌లతో ఇంటెన్స్ నెరేటివ్‌గా సినిమా ఉండనుందని మేకర్స్ చెప్పడంతో అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్ కాగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు.