Sharwanand: శర్వానంద్ డబుల్ ట్రీట్.. కొత్త సినిమాల అప్డేట్స్ కమింగ్

Sharwanand: శర్వానంద్ డబుల్ ట్రీట్.. కొత్త సినిమాల అప్డేట్స్ కమింగ్

డిఫరెంట్ స్క్రిప్ట్స్లను సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. గురువారం (మార్చి 6న) తన పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్స్‌‌తో శర్వాకు బర్త్‌‌డే విషెస్ చెప్పారు మేకర్స్. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తను హీరోగా నటిస్తున్న చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్‌‌.

శర్వానంద్ పరిగెడుతుంటే.. తనని ఫాలో అవుతూ హీరోయిన్స్ వెంబడిస్తున్న పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఏకే ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయనున్నట్టు  ప్రకటించారు. మరోవైపు శర్వానంద్ హీరోగా నటిస్తున్న 36వ సినిమాలో బైక్ రేసర్‌‌‌‌గా కనిపించనున్నట్టు రివీల్ చేశారు.

ALSO READ | Nayanthara: తెరపైకి నయనతార వంద కోట్ల ప్రాజెక్ట్.. అమ్మోరు తల్లి సీక్వెల్ షురూ..

అభిలాష్ కంకర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ  నిర్మిస్తోంది. మూడు తరాల నేపథ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌‌గా నటిస్తోంది. షూటింగ్ ఫైనల్ స్టేజ్‌‌కి చేరుకుందని, త్వరలోనే  టైటిల్‌‌ను లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని మేకర్స్ చెప్పారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.