
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకడైన శర్వానంద్, రక్షితా రెడ్డి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. ఉదయం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో అతి కొద్దిమంది సన్నిహితులు, బంధువుల మధ్య వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు శర్వానంద్ బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన హాజరయ్యారు. ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫొటోలు బయటికి రావడంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు చెబుతున్నారు.
రక్షితా రెడ్డి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఆమె తెలంగాణ హైకోర్ట్ న్యాయవాది మధుసూధన్ రెడ్డి కుమార్తె, ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలు. నిశ్చితార్థం ముగియడంతో శర్వానంద్, రక్షితా రెడ్డి జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది.