
డిఫరెంట్ స్ర్కిప్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. ఇప్పటికే రెండు సినిమాలు పూర్తికాగా, రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం సంపత్ నంది డైరెక్షన్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శర్వా 38వ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. 1960 బ్యాక్‌డ్రాప్‌లో పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు, ఇందులో శర్వానంద్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్టు దర్శక నిర్మాతలు తెలియజేశారు. శర్వా పాత్ర కోసం బాలీవుడ్ స్టైలిస్టులు ఆలిమ్ హకీమ్, రషీద్‌లతో మేకోవర్ చేస్తోంది టీమ్.
ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ,హిందీతో సహా పలు భాషలలో సినిమా విడుదల కానుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.