Shashank Singh: నెం.1 ఆల్ రౌండర్‌కు నో ఛాన్స్: పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చెప్పిన శశాంక్ సింగ్

Shashank Singh: నెం.1 ఆల్ రౌండర్‌కు నో ఛాన్స్: పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ 11 చెప్పిన శశాంక్ సింగ్

పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శశాంక్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఐపీఎల్ 2024 సీజన్ లో పంజాబ్ కింగ్స్ తరపున సహచర క్రికెటర్లు విఫలమవుతున్నప్పటికీ ఒక్కడే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఆడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్ని మ్యాచ్ లు ఓడిపోయినా మరికొన్ని మ్యాచ్ ల్లో పంజాబ్ కు సంచలన విజయాలను అందించాడు. ఏ మాత్రం అంచనాలు లేని శశాంక్ అద్భుతంగా రాణించడంతో అతన్ని 2025 ఐపీఎల్ కోసం రూ. 5.5 కోట్ల రూపాయలకు పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకుంది.

ఈ సీజన్ కు ముందు ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన శశాంక్ తమ జట్టు ఎలా ఉండబోతుందో  చెప్పుకొచ్చాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో శుభంకర్ మిశ్రాతో ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్, అన్ క్యాప్డ్ ప్లేయర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను మూడో స్థానంలో.. ఆస్ట్రేలియా పవర్ హిట్టర్లు మార్కస్ స్టోయినిస్,గ్లెన్ మాక్స్‌వెల్‌లను వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో సెలక్ట్ చేశాడు. తనను ఆరో స్థానంలో.. అదే విధంగా ఫినిషర్ పాత్రకు 7వ స్థానంలో నెహాల్ వధేరా వచ్చే అవకాశం ఉందని చెప్పాడు.

సౌతాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ ను 8 వ స్థానంలో.. సెట్ చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ గా యుజ్వేంద్ర చాహల్ ప్లేయింగ్ 11 లో ఉంటారని తెలిపాడు. అర్షదీప్ సింగ్ ఫాస్ట్ బౌలర్ గా ఎంపిక చేసిన అతను హర్‌ప్రీత్ బ్రార్ జట్టులో ఉండే అవకాశం ఉందని తెలిపాడు. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గుసన్, వన్డే నెంబర్ వన్ ఆల్ రౌండర్ లకు శశాంక్ పంజాబ్ జట్టులో స్థానం ఇవ్వలేదు. శశాంక్ చెప్పడంతో పంజాబ్ టీమ్ తమ సీజన్ తొలి మ్యాచ్ ను ఇదే జట్టుతో ఆడడం దాదాపుగా ఖాయమైంది. మార్చి 25 న గుజరాత్ టైటాన్స్ తో పంజాబ్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇంపాక్ట్ ప్లేయర్లుగా యష్ ఠాకూర్, కుల్దీప్ సేన్‌లను ఎంచుకున్నాడు.