
షష్టగ్రహకూటమి.. సూర్యగ్రహణం ఒకే సమయంలో ఏర్పడటం (మార్చి 29) వల్ల వీటి ప్రభావం ప్రతి రాశి జాతకులపై కచ్చితంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. షష్టగ్రహకూటమి ప్రారంభమైనప్పటి ( మార్చి 29... 10.32) నుంచి 60 గంటలు ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. షష్టగ్రహకూటమి ప్రభావం 12 రాశులపైఎలా ఉంటుంది.. ఏరాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. . .
మేష రాశి.. షష్టగ్రహప్రభావం ప్రభావం వల్ల బాధ్యతలు పెరుగుతాయి. అంతేకాదు మీలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. శని భగవానుడు రాశి మారడం వల్ల మీ కెరీర్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. మీ వ్యక్తిగత లక్ష్యాలు కూడా మారతాయి.
పరిహారాలు: శనికి అభిషేకం చేయండి.. నువ్వుల దానం చేయండి.
వృషభం.. శని రాశిమార్పు వల్ల మీలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీరు దూరం ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశం ఉంది. అంతేకాదు శని వల్ల మీ వ్యక్తిగత జీవితంలో అనుకోని మార్పులు సంభవిస్తాయి.
పరిహారాలు:హనుమంతుడికి ఆకుపూజ చేయండి.
మిథున రాశి.. షష్టగ్రహ కూటమి వలన మిథున రాశివారికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతాయి. వ్యాపారస్తులకు పెద్దగా లాభాలు ఉండవు. వెంకటేశ్వరస్వామి ఆలయాలను దర్శించండి.
పరిహారాలు: సూర్య నమస్కారాలు చేయండి.
కర్కాటక రాశి.. వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భాగస్వామ్యంలో అనుకోని మార్పులు రావచ్చు. శని ఎఫెక్ట్ వల్ల మీరు చాలా ఆలోచించి అడుగువేయాలని పండితులు సూచిస్తున్నారు.
పరిహారాలు:హనుమంతుని దేవాలయంలో 108 ప్రదక్షిణాలు చేయండి. బ్రాహ్మణులకు వస్త్రదానం చేయడం మర్చిపోవద్దని పండితులు సూచిస్తున్నారు.
సింహ రాశి.. ఈ రాశి వారు ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలి. మీ ప్రతి పనిలో కాస్త ఏకాగ్రత పెంచాల్సి ఉంటుంది. మీ లైఫ్‌స్టైల్‌లో కూడా భారీ మార్పులు వస్తాయి.
పరిహారాలు:నువ్వుల దానం చేయండి.. పేదలకు అన్నదానం చేయండి.
కన్యారాశి.. ఈ రాశివారిలో సృజనాత్మకత పెరుగుతుంది. భాగస్వామితో మరింత ప్రేమ పెరుగుతుంది. అంతేకాదు ఎన్నో రోజులుగా కంటున్న కలలు ఇప్పుడు సాకారం అయ్యే అవకాశం ఉంటుంది.
పరిహారాలు:తులసి చెట్టు దగ్గన దీపారాధన చేసి విష్ణు సహస్రనామం చదవండి లేక వినండి.
తులారాశి.. ఈ రాశివారికి ఇంట్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయి. అంతేకాదు శని వల్ల వీరు కుటుంబంతో మరికాస్త అనుబందం పెంచుకునే అవకాశం ఉంటుంది.
పరిహారాలు: ఆవుకు తోటకూర.. ఉలవలు ఆహారంగా ఇవ్వండి.
వృశ్చిక రాశి.. ఈ రాశివారి లైఫ్‌లో కూడా భారీ మార్పులు జరుగుతాయి. ప్రధానంగా మాట ఆచితూచి మాట్లాడాలి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. హనుమంతునికి ఆకుపూజ చేయండి.
పరిహారాలు: హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
ధనస్సు రాశి.. ఈ రాశివారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వ్యాపారం విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ప్రతి విషయంలో ఓర్పు .. సహనం తో ఉండాలి. శనిభగవానుడు రాశి మారడం ఈ రాశి వారికి ఓ గుణపాఠం నేర్పుతుంది. ప్రధానంగా డబ్బులు, వ్యక్తిగత విలువలు కూడా మారతాయి.
పరిహారాలు: పరమేశ్వరుడికి అభిషేకం చేయండి.
షష్టగ్రహకూటమి ప్రారంభమైనప్పటి ( మార్చి 29... 10.32) నుంచి 60 గంటలు ఉంటుంది. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. షష్టగ్రహకూటమి ప్రభావం 12 రాశులపైఎలా ఉంటుంది.. ఏరాశి వారు ఎలాంటి పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. . మకర రాశి వారికి శని రాశి మార్పు, జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయి. శని వల్ల మీ ప్రొఫెషన్ లైఫ్‌లో బాధ్యతలు కూడా పెరుగుతాయి. దైవదర్శనం చేయండి.
పరిహారాలు:రావి చెట్టు కింద దీపారాధన చేసి దుర్గాదేవిని పూజించండి.
కుంభ రాశి.. ఆధ్యాత్మికత పెరగుతుంది. ఏకాగ్రత కూడా పెంచుకుంటారు. నిజానిజాలు తెలుసుకునే సమయం వచ్చిందని గ్రహించండి. పరిహారాలు: హనుమాన్ చాలీసా పఠనం చేయండి.
మీనరాశి.. మీ భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. మీ వ్యక్తిగత లక్ష్యాలు మారే అవకాశం ఉంది. శని వల్ల మీ జీవిత పరమార్థాన్ని కూడా తెలుసుకుంటారు.
పరిహారాలు: తులసి చెట్టు దగ్గర ఆవునెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారి ఆలయాలను దర్శించండి