శతమానం భవతి సీక్వెల్

శతమానం భవతి సీక్వెల్

ఏడేళ్ల క్రితం సంక్రాంతికి చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది ‘శతమానం భవతి’. శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి మంచి ఆదరణ దక్కింది. అనుపమ పరమేశ్వరన్‌‌‌‌ హీరోయిన్‌‌గా, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కుటుంబ కథా చిత్రంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

జాతీయ అవార్డును  సైతం అందుకుంది. ఈ సినిమా వచ్చి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా దీనికి సీక్వెల్‌‌ను అనౌన్స్ చేశారు నిర్మాత దిల్ రాజు. ‘శతమానం భవతి’ నెక్స్ట్ పేజ్.. వచ్చే ఏడాది సంక్రాంతికి కలుద్దాం అంటూ ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌ వేల్యూకు తగ్గట్టు గ్రాండ్‌‌ స్కేల్‌‌లో ఈ సీక్వెల్‌‌ను రూపొందిం చనున్నట్టు తెలియజే శారు. అయితే ఇందులోని నటీనటులను, దర్శ కుడిని రిపీట్ చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.