ఒకప్పుడు మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు పెద్దగా జరిగేవి కాదు. ఒకవేళ జరిగినా ఇరువురు కుటుంబ సభ్యులు గొడవలు పడటం, ప్రేమికులని హత్యలు చెయ్యడం ఇలాంటివి జరిగేవి. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆచారాలు, కట్టుబాట్లు, సంప్రదాయాలు వంటివాటితో మనుషుల ఆలోచన తీరులో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే బాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఇటీవలే ముస్లీమ్ రిలీజియన్ కి చెందిన జహీర్ అనే తన తోటి నటుడిని పెళ్లి చేసుకుంది.
వీరిపెళ్లి జులైలో ముంబైలోని సోనాక్షి సిన్హా ఇంట్లో ఘనంగా జరిగింది. అయితే ఈ పెళ్లికి సోనాక్షి సోదరులు లవ్, కుష్ హాజరుకాలేదు. దీంతో సోనాక్షి మతాంతర వివాహం చేసుకోవడం తన సోదరులైన లవ్, కుష్ లకి ఇష్టం లేదని అందుకే సోనాక్షి దంపతులకి దూరంగా ఉంటున్నారని పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
దీంతో ఇటీవలే ఈ విషయంపై సోనాక్షి సిన్హా తండ్రి, ఒకప్పటి స్టార్ హీరో, ప్రముఖ పొలిటీషియన్ శత్రుజ్ఞ సిన్హా స్పందించాడు. ఇందులో భాగంగా లవ్, కుష్ ల బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ వారికంటే నాకు జీవితంపట్ల అనుభవం, అవగాహన ఉన్నాయని తెలిపాడు. అందుకే నా కూతురు సోనాక్షి జహీర్ ల పెళ్లిని స్వాగతిస్తున్నాని చెప్పుకొచ్చాడు. అలాగే ఇద్దరి వ్యక్తులు పెళ్లి చేసుకోవడానికి కావాల్సింది ప్రేమ, అర్థం చేసుకునే గుణం అని అన్నారు. ఇక ఈ కలియుగంలో ఆడపిల్లకి తనకి నచ్చిన భాగస్వామిని ఎన్నుకునే హక్కు ఉందని కాబట్టి తన కూతురు చేసింది తప్పు కాదని సోనాక్షి వివాహాన్ని సమర్థించాడు.
ALSO READ | ఇది నిజమేనా: అక్కడ కూలీకి సిద్దమైన స్టార్ హీరో!
ఈ విషయం ఇలా ఉండగా నటి సోనాక్షి సిన్హా, జహీర్ కలసి గతంలో డబుల్ ఎక్స్ఎల్ అనే బాలీవుడ్ సినిమాలో నటించారు. ఈ సినిమా 2022 లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పేదల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
జహీర్ కెరీర్ విషయానికొస్తే 2019లో ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నిర్మించిన నోట్ బుక్ అనే సినిమాలో హీరోగా నటించి కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత పెద్దగా సినిమాలు చెయ్యలేదు. ఇక సోనాక్షి ఇటీవలే హిందీలో రిలీజ్ అయిన బడే మియాన్, చోటా మియాన్ అనే సినిమాలో నటించింది. ప్రస్తుతం తన సోదరుడు కుష్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న "నికితా రాయ్: ది బుక్ ఆఫ్ డార్క్నెస్" అనే సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.