19 ఏళ్ల ఖైదీకి కడుపులో తీవ్రమైన నొప్పి వచ్చింది. ఖైదీని డాక్టర్ దగ్గర తీసుకెళ్లిన జైలు అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. వాడి కడుపు నొప్పికి కారణాలు, ఖైది కడుపులో ఉన్న వస్తువులు చూసి అంతా అవాక్కయ్యారు. ఇంతకీ ఖైదీ కడుపులో ఏమున్నాయి.. ఎక్కడ జరిగింది పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు.. మన రాష్ట్రంలోనే అదీ హైదరాబాద్ లోని చంచల్ గూడ సెంట్రల్ జైలులో.. 19 ఏళ్ల సోహైల్ పలు దొంగతనాల కేసులో పట్టుబడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతనిపై పీడీ యాక్ట్ ఉంది. అయితే సోహైల్ సోమవారం (జనవరి 08) తీవ్ర కడుపు నొప్పి వస్తుందని చెప్పడంతో జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సోహైల్ కడుపును ఎక్స్ రే తీయగా వైద్యులకు షాకింగ్ విషయాలు తెలిశాయి.సోహైల్ కడుపులో షేవింగ్ బ్లేడ్లు, స్క్య్రూలు వంటి చాలా మెటల్ వస్తువులు, గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి అన్ని వస్తువులను తొలగించారు.