ఒడిశా అసెంబ్లీలో అతి చిన్న వయసున్న ఎమ్మెల్యే ఈమే

ఒడిశా అసెంబ్లీలో అతి చిన్న వయసున్న ఎమ్మెల్యే ఈమే

ఒడిశా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దాంతో 25 ఏళ్ల నవీన్‌ పట్నాయక్‌ పాలనకు తెరపడింది. బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ప్రమాణస్వీకారాలు చేశారు. వీరిలో బ్రహ్మగిరి బీజేపీ ఎమ్మెల్యే ఉపాస్నా మహాపాత్ర ఒడిశా అసెంబ్లీలోనే అతిపిన్న వయస్సు ఎమ్మెల్యే. ఆమె కేవలం 26 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టింది.1997 జూన్‌ 20న ఆమె జన్మించారు. 

చిన్న వయస్సులో ఒడిశా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అడుగుపెట్టడం తనకు ఎంతో గర్వంగా ఉందని మహాపాత్ర అన్నారు. బ్రహ్మగిరి నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయనని, శక్తివంచన లేకుండా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పారు.