ఈమె నా ప్రాణాలు కాపాడింది: డొనాల్డ్ ట్రంప్‌

ఈమె నా ప్రాణాలు కాపాడింది: డొనాల్డ్ ట్రంప్‌

న‌వంబ‌ర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో  ప్రధాన పార్టీలైన డొమొక్రటిక్, రిప‌బ్లిక‌న్ పార్టీలు ప్రచార స్పీడ్ ను పెంచాయి. కాగా  డొమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా  క‌మ‌లా హ్యారీస్‌, రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్‌ అధ్యక్ష రేసులో ఉన్నారు. అయితే ఇటీవ‌ల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఓ దుండ‌గుడు కాల్పుల‌కు పాల్పడడం మనందిరికి తెలిసిందే. పెన్సిల్వేనియాలో ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌పై ఓ దుండ‌గుడు కాల్పులు జరపగా ట్రంప్ తృటిలో తప్పించుకున్నాడు. ఈ సంఘటనలో ట్రంప్ చెవికి గాయమైంది. 

ఐతే తాజాగా ఈ ఘ‌ట‌న‌పై ట్రంప్ స్పందించారు. ఓ మ‌హిళ వ‌ల్లే తాను ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాన‌ని తెలిపారు. ఆ మ‌హిళ‌ను ప్రత్యేకంగా వేదిక‌పైకి పిలిచి అభినందించారు. పెన్సిల్వేయా స‌భ‌లో మాట్లాడుతుండ‌గా కంప్యూట‌ర్ సెక్షన్ సిబ్బందిలోని ఓ యువ‌తి వ‌ల‌స‌దారుల చార్ట్ ను స్క్రీన్ పై ప్రదర్శించారని... దాన్ని చూసేందుకు త‌ల‌ను తిప్పగా బుల్లెట్ తనకు తగలకుండా మిస్ అయిందని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆ మ‌హిళ‌ను వేదిక‌పైకి పిలిచి ఆప్యాయంగా ఆలింగ‌నం చేసుకున్నారు.