నుమాయిష్​లో రెచ్చిపోయిన మైనర్లు: ఈవ్ టీజింగ్ ​చేసిన 24 మంది అరెస్ట్

నుమాయిష్​లో రెచ్చిపోయిన మైనర్లు: ఈవ్ టీజింగ్ ​చేసిన 24 మంది అరెస్ట్
  • 223 మంది పోకిరీలపై కేసులు.. వీరిలో 33 మందికి ఫైన్లు

హైదరాబాద్ సిటీ, వెలుగు: నుమాయిష్ ఎగ్జిబిషన్​లో ఈవ్ టీజింగ్ కు పాల్పడిన 247 మందిని పట్టుకున్నామని హైదరాబాద్ సిటీ విమెన్ సేఫ్టీ వింగ్, సైబర్ క్రైమ్ డిప్యూటీ కమిషనర్ దార కవిత తెలిపారు. నిందితుల్లో 24 మంది మైనర్లు ఉన్నారన్నారు.వీరిని కోర్టులో ప్రవేశపెట్టగా ఇద్దరికి 2 రోజుల జైలు శిక్ష, 33 మందికి జరిమానా విధించారన్నారు. 

190 మందిని హెచ్చరించి, కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశామన్నారు. 37 పెట్టీ కేసులు నమోదు చేశామన్నారు. 20 కేసులుపెండింగ్ లో ఉన్నాయన్నారు. మహిళలకు సమస్య ఎదురైతే 94906 16555 కు వాట్సాప్​ద్వారా సమాచారం ఇవ్వొచ్చన్నారు.