షీ టీమ్స్కు పదేళ్లు.. నెక్స్ట్ ప్లాన్ ఇదే..

షీ టీమ్స్కు పదేళ్లు.. నెక్స్ట్ ప్లాన్ ఇదే..

హైదరాబాద్: మహిళలను వేధింపుల నుంచి రక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించిన షీ టీమ్స్ 10 సంవత్సరాలు  పూర్తి చేసుకున్నాయి. ఈ సందర్భంగా.. అడిషనల్ డీజీపీ సీఐడీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ షికా గోయల్ షీ టీమ్స్ సేవలను గుర్తు చేశారు. పబ్లిక్, సైబర్ స్పేస్లలో వేధింపులను ఎదుర్కొంటున్న మహిళలకు మద్దతుగా తెలంగాణ షీ టీమ్స్ మొదటి ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. 2018లో మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగంగా ఏర్పడినప్పటి నుంచి షీ టీమ్స్ మహిళా భద్రతనే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

ALOS READ | కూకట్‎పల్లిలో తనిఖీలు: పోలీసుల అదుపులో 31 మంది మహిళలు

బహిరంగ ప్రదేశాల్లో మహిళలకు సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో షీ టీమ్స్ ముందుందని గుర్తుచేశారు. వేధింపులు.. బెదిరింపులు లేకుండా, బాలికలపై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడంలో షీ టీమ్స్ సమర్థవంతంగా పనిచేసిందని షికా గోయల్ తెలిపారు.

షీ టీమ్స్ సేవల గురించి షికా గోయల్ ఇంకా ఏం చెప్పారంటే..
* అక్టోబర్ 24, 2014లో హైదరాబాద్ నగరంలో షీ టీమ్స్ ప్రారంభించారు
* హైదరాబాద్ నగరంలో షీ టీమ్స్ సాధించిన అద్భుతమైన విజయంతో తెలంగాణ రాష్ట్రమంతట షీ టీమ్స్ విస్తరించింది
* ప్రజల నుంచి సానుకూలత, మంచి స్పందన, ఫ్రెండ్లీ పోలీసింగ్, ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీ ఇవ్వడంతో  దేశంలోని వివిధ రాష్ట్ర పోలీస్ సంస్థలు షీ టీమ్స్ను అనుసరించాయి
* షీ టీమ్స్ ప్రస్తుతం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పని చేస్తున్నాయి. భవిష్యత్తులో అన్ని పోలీస్ సబ్ డివిజన్లతో పాటు ప్రతి పోలీస్ స్టేషన్లో విస్తరించాలని ప్లాన్ చేస్తున్నాం
* ప్రస్తుతం షీ టీమ్స్లో 30 పోలీస్ యూనిట్లలో 328 మంది అధికారులు పని చేస్తున్నారు.