మానవపాడు, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం బోరవెల్లిలో శుక్రవారం పొట్టేళ్ల పందేలు హోరాహోరీగా సాగాయి. గ్రామంలోని చెన్నకేశవస్వామి జాతర సందర్భంగా పొట్టేళ్ల పందేలు నిర్వహించారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పాల్గొని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు గ్రామాల నుంచి వచ్చిన 16 పొట్టేళ్లు తలపడ్డాయి.
ఏపీలోని నంద్యాల జిల్లా వాడాలకు పొట్టేలు ఫస్ట్ ప్రైజ్, కర్నూల్ కు చెందిన పొట్టేలు రెండు, నంద్యాల జిల్లా బేతంచర్లకు చెందిన పొట్టేలు థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నాయి. పోటీలు ఆధ్యంతం ఢీ అంటే ఢీ అన్నట్లుగా సాగాయి. పందేలు చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎంపీపీ అశోక్ రెడ్డి, నాయకులు శశిరెడ్డి, సత్యారెడ్డి, హరిచంద్రారెడ్డి, సర్పంచ్ విజయ్, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు గోపాల్ తదితరులు
పాల్గొన్నారు.