దళారుల ప్రమేయం లేకుండా గొర్రెలు పంపిణీ చేయాలి:గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం

ముషీరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకంలో తీవ్ర నిర్లక్ష్యం చేసిందని గొర్రెలు మేకల పెంపకదారుల సంఘం విమర్శించింది. గొర్రెల పెంపకం దారుల పట్ల ప్రభుత్వ వైఖరి అనే అంశంపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెల్లె గోపాల్ అధ్యక్షతన సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

ప్రధాన కార్యదర్శి ఉడత రవీందర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన రెండో విడత గొర్రెల పంపిణీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెల కాపరులకు ఎక్స్​గ్రేషియా ఇవ్వాలని కోరారు. దళారుల ప్రమేయం లేకుండా నగదు బదిలీ చేసి, రెండో విడత గొర్రెల పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ రామయ్య, మారం తిరుపతి యాదవ్ తదితరులు 
పాల్గొన్నారు.