సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శం: చింతా ప్రభాకర్

కంది, వెలుగు :  సంక్షేమ పథకాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శమని   సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్​ అధ్యక్షుడు​ చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి మండలం కొత్లాపూర్​ లో లబ్ధిదారులకు గొర్రెలను అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన   మాట్లాడుతూ .. గడపగడపకు బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న సంక్షేమ ఫలాలు లేవని చెప్పారు.

ALSO READ :రిమ్స్ హాస్పిటల్​పై .. ప్రభుత్వం నిర్లక్ష్యం

 దేశానికే ఆదర్శంగా తెలంగాణ   ఎదుగుతుంటే ఓర్వలేక పోతున్నారన్నారు.   కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలు రైతులు మరువలేదని,   రైతులను రాజును చేసిన ఘనత సీఎం కేసీఆర్​దేనన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మనోహర్ గౌడ్, గ్రామ సర్పంచ్ సందీప్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, లబ్ధిదారులు పాల్గొన్నారు.