మహాముత్తారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పెగడపల్లి గిరిజన తండాలో మంగళవారం శీత్లా పండుగను గిరిజన లంబాడీలు ఘనంగా జరుపుకున్నారు. తండా వాసులు పశు సంపదను అలంకరణ చేసి పూజా ప్రదేశానికి తీసుకువెళ్ళారు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక చెట్టుకింద ఏడుగురుదేవతా మూర్తుల ప్రతిమలను ప్రతిష్ఠించారు. దాటుడు కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం పిల్లాపాపలతో వనభోజనాలు చేసి, నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో తండా నాయకులు జాటోత్ పర్తినాయక్, దేవు నాయక్, శ్రీరాం నాయక్, సర్పంచ్ కొర్ర వినోద జగపతి నాయక్, ఎంపీటీసీ జాటోత్ వసంత రూపానాయక్, తండా పెద్దలు కొర్ర భీలు నాయక్, జగ్గునాయక్, జాటోత్ రతన్ నాయక్, ధన్రాం నాయక్, చించునాయక్ తండా వాసులు పాల్గొన్నారు.