రోహిత్, సూర్య, హార్దిక్‌లను కలిసిన UAE ఉప ప్రధాని.. దుబాయ్ 11 జెర్సీ బహుకరణ!

రోహిత్, సూర్య, హార్దిక్‌లను కలిసిన UAE ఉప ప్రధాని.. దుబాయ్ 11 జెర్సీ బహుకరణ!

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఎఇ ఉప ప్రధాన మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మంగళవారం (ఏప్రిల్ 8) ముంబైలో భారత క్రికెటర్లను కలిశారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ కూడా ఈ మీటింగ్ లో ఉన్నారు. షేక్ హమ్దాన్ తన  రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ముంబైకి వచ్చినప్పుడు అతను ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలను కలిసిన మీటింగ్ వైరల్ అవుతుంది.

నల్లటి సూట్ ధరించి.. షేక్ హమ్దాన్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుబాయ్ 11 అని ఉన్న జెర్సీని బహుకరించారు. హిట్ మ్యాన్ తో కలిసి జెర్సీ పట్టుకుని ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చారు. ఈ సంతోష క్షణాని షేక్ హమ్దాన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసుకున్నారు. భారత క్రికెటర్లతో కలిసి మీటింగ్ లో దిగిన ఫోటోలను షేర్ చేసుకున్న అతను.. హిందీలో “టీమ్ ఇండియా కే సాథ్ ఏక్ యాద్‌గార్ ములకత్” అని రాసుకొచ్చారు. దీని అర్ధం "టీమ్ ఇండియాతో చిరస్మరణీయ సమావేశం". ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారుతుంది. 

►ALSO READ | KKR vs LSG: అప్పుడు వరల్డ్ కప్ ఫైనల్.. ఇప్పుడు ఐపీఎల్: యాక్టింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన పంత్

ఐపీఎల్ లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ అంచనాలకు తగ్గట్టు రాణించడంతో విఫలమవుతుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో ఒక విజయం..  ఓటములతో పాయింట్ల పట్టికలో 8 వ స్థానంలో నిలిచింది. బుమ్రా, రోహిత్ శర్మ, సూర్యా కుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ పేలవ ప్రదర్శన చేస్తుంది. ఈ టోర్నమెంట్ లో ముంబై తమ తదుపరి మ్యాచ్ ఆదివారం (ఏప్రిల్ 13) ఢిల్లీ క్యాపిటల్స్ తో తలబడుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 నిమిషాలకు జరుగుతుంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fazza (@faz3)