భారత్ కు చేరుకున్న షేక్ హసీనా

భారత్ కు చేరుకున్న షేక్ హసీనా

బంగ్లాదేశ్ లో మహా సంక్షోభం ఏర్పడింది. రిజర్వేషన్లపై కొన్ని రోజులుగా సాగుతున్న ఆందోళనల్లో ఇప్పటికే వందల మంది చనిపోయారు. నాలుగు రోజులుగా ఆందోళనలు సద్దుమణిగినట్లే కనిపించినా.. 2024, ఆగస్ట్ 5వ తేదీ తిరిగి మళ్లీ  పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఈ ఆందోళనల్లో 300 మంది చనిపోయారు. ఇదే సమయంలో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఆఫీసులోకి ఆందోళనకారులు ప్రవేశించడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా దేశం వదిలి పారిపోయారు. ఈ క్రమంలో  భారత్ లోని అగర్తలాకు చేరుకున్న షేక్ హసీనా.