బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు జాయ్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించేటప్పుడు మళ్లీ షేక్ హసీనా దేశానికి తిరిగి వస్తరని ఆమె కొడుకు జాయ్ అన్నాడు. వారంరోజులపాటు జరిగిన అల్లర్లు, వ్యతిరేఖ తిరుగుబాట్ల కారణం ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టి వెళ్లింది. ముహమ్మద్ యూనస్ ఆద్వర్యంలో ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.
అమెరికాలో ఉన్న షేక్ హసీనా కుమారుడు జాయ్ సజీబ్ వాజెద్ జాయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఆమె న్యూఢిల్లీలో సురక్షితంగా ఉందని తెలిపాడు. తర్వాత జరిగే ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ పోటీ చేస్తుందని.. ఎలక్షన్ లో నిలబడటానికి ఆమె బంగ్లాదేశ్ వస్తారని.. అందులో విజయం కూడా సాధిస్తుందని జాయ్ ధీమా వ్యక్తం చేశాడు. గతంలో జాయ్ ఆమె తిరిగి రాజకీయాల్లోకి రాదని చెప్పాడు.