
హైదరాబాద్: నిషేధిత ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఇండియా (పీఎఫ్ఐ) కేసులో అరెస్ట్ అయిన షేక్ ఇలియాస్ అహ్మద్‌ను నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) కస్టడీలోకి తీసుకుంది. ఐదు రోజుల పాటు ఇలియాస్ అహ్మద్‌ను ఎన్ఐఏ విచారించనుంది. ఉగ్రవాద కార్యకలాపాలు, పీఎఫ్ఐ సంస్థకు ఫండింగ్ కోసం పని చేస్తున్నాడన్న ఆరోపణలపై ఇలియాస్ అహ్మద్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీంతో 2025, జనవరి 29న అహ్మద్ నాంపల్లి కోర్టులో లొంగియాపోయాడు.
ఈ కేసులో మరిన్నీ విషయాలు రాబట్టేందుకు ఇలియాస్ అహ్మద్‌ను కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్ఐఏ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన నాంపల్లి కోర్టు.. ఇలియాస్ అహ్మద్‌ను ఐదు రోజుల పాటు కస్టడీకి అప్పగించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇలియాస్ అహ్మద్‌ను ఎన్ఐఏ అధికారులు బుధవారం (ఫిబ్రవరి 19) అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలు, పీఎఫ్ఐకి ఫండింగ్ వంటి అంశాలకు సంబంధించిన వివరాలను ఎన్ఐఏ రాబట్టనున్నట్లు తెలుస్తోంది.
ALSO READ | SBI బ్యాంకులోనే రైతుల ధర్నా: పత్తి అమ్మిన డబ్బులు ఇవ్వటం లేదంటూ ఆందోళన