బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కరెన్సీపై షేక్ హసీనా తండ్రి చిత్రం తొలగింపు 

బంగ్లాదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశం నుంచిషేక్ హసీనా నిష్క్రమించిన కొన్ని నెలల తర్వాత ..బంగ్లాదేశ్ ప్రభుత్వం తన కరెన్సీ నోట్ల నుంచి మాజీ ప్రధాని తండ్రి ,దేశ వ్యవస్థాపక వ్యక్తులలో ఒకరైన షేక్ ముజిబుర్ రెహమాన్ ఇమేజ్‌ను తొలగించింది.. కొత్త కరెన్సీ లో షేక్ ముజిబుర్ రెహమాన్ ఇమేజ్ లేకుండా ముద్రిస్తోంది. 

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా తండ్రి, దేశ వ్యవస్థాపక నేత షేక్‌ ముజిబుర్‌ రెహమాన్‌ చిత్రాన్ని ఆ దేశ కరెన్సీ నోట్ల నుంచి తొలగించనున్నట్లు ఢాకా ట్రిబ్యూన్‌ తెలిపింది. హసీనాను భారత్‌కు పారిపోయేలా చేసిన విద్యార్థి నేతృత్వంలోని ఉద్యమం జూలై తిరుగుబాటును గుర్తుచేసే అంశాలను కలిగి ఉన్న కొత్త నోట్లను బంగ్లాదేశ్ బ్యాంక్ ముద్రిస్తున్నట్లు తెలిపింది. 

2024 జులై తిరుగుబాటులో ప్రభుత్వ ఉద్యోగాల కోటా వ్యవస్థకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో షేక్ హసీనా పదవీ వీడి ఇండియా రావాల్సి వచ్చింది. హసీనా ఇండియాకు వచ్చిన ఆరు నెలల తర్వాత బంగ్లా ప్రభుత్వం నోట్లపై షేర్ ముజిబుర్ రెహమాన్ చిత్రాన్ని తొలగిస్తూ నిర్ణయించింది.