ఇండియా–ఎ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇండియా–ఎ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     దులీప్ ట్రోఫీ బరిలో ఏపీ కుర్రాడుదులీ
  •     12 నుంచి రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు
  •     బంగ్లాతో టెస్టు కోసం సీనియర్లు దూరం

అనంతపూర్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తొలి టెస్టు కోసం టీమిండియాకు ఎంపికైన స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్,  శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు మెజారిటీ ఆటగాళ్లు  ఈనెల 12 నుంచి జరిగే దులీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ రెండో రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు దూరం అవుతున్నారు. ఈ మేరకు పలువురు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు ఆయా జట్లలో వారి స్థానాలను భర్తీ చేశారు. టీమిండియా ప్లేయర్ రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఏపీ కుర్రాడు షేక్ రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చాన్స్ ఇచ్చారు. పంత్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రింకూ సింగ్ ఇండియా–బి టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపికవగా...

షేక్ రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా–ఎ జట్టులో చోటు దక్కించుకున్నాడు.  గిల్ స్థానంలో ప్రథమ్ సింగ్ (రైల్వేస్), కేఎల్ రాహుల్ స్థానంలో అక్షయ్ వాడ్కర్ (విదర్భ)ను  ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. కుల్దీప్ యాదవ్  స్థానాన్ని లెఫ్టార్మ్ స్పిన్నర్ శామ్స్ ములానీతో  ఆకాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దీప్  స్థానాన్ని ఆకిబ్ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భర్తీ చేస్తున్నట్టు తెలిపింది. గిల్ స్థానంలో ఇండియా –ఎ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మయాంక్ అగర్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బాధ్యతలు అప్పగించింది.  

ఇండియా–డి  జట్టులో అక్షర్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి నిశాంత్ సంధూ వచ్చాడు. గాయం కారణంగా పేసర్ తుషార్ దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండే ఆటకు దూరమవ్వడంతో ఇండియా– ఎ ఆటగాడు విద్వాత్ కవేరప్పను తీసుకున్నారు. కాగా, రుతురాజ్ గైక్వాడ్ నేతృత్వంలోని ఇండియా– సి జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.