జనగామ కలెక్టర్‌‌గా షేక్‌‌ రిజ్వాన్‌‌ బాషా

జనగామ అర్బన్, వెలుగు : జనగామ కలెక్టర్‌‌గా షేక్‌‌ రిజ్వాన్‌‌ బాషా నియామకం అన్నారు. జనగామ ప్రస్తుత కలెక్టర్‌‌ సీహెచ్‌‌. శివలింగయ్య జనరల్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు ట్రాన్స్‌‌ఫర్‌‌ అయ్యారు. ఆయన స్థానంలో గ్రేటర్‌‌ వరంగల్‌‌ మున్సిపల్‌‌ కమిషనర్‌‌గా పనిచేస్తున్న షేక్‌‌ రిజ్వాన్‌‌ బాషాను నియమిస్తూ ప్రభుత్వం ఆర్డర్స్‌‌ జారీ చేసింది. కొత్త కలెక్టర్‌‌ మరో మూడు రోజుల్లో ఛార్జ్‌‌ తీసుకోనున్నట్లు సమాచారం.