కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు : సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు స్పీడప్ చేయాలని బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. కమిషనర్ క్యాంప్ ఆఫీస్‌లో గురువారం నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు. భక్తులకు ఇబ్బందులకు తలెత్తకుండా శానిటేషన్, తాగునీరు, లైటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
గ్రేటర్ పరిధిలోని రంగ సముద్రం, చిన్న వడ్డేపల్లి, బెస్తం చెరువు, కాశీబుగ్గ పద్మనగర్తో కలిపి మొత్తం 14 చెరువుల వద్ద ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రివ్యూలో సీఎంహెచ్‌వో రాజేశ్, ఈఈలు శ్రీనివాస్, సంజయ్‌కుమార్, డీఈలు రవికుమార్, రవి కిరణ్, ఏఈ హాబీబుద్దీన్ పాల్గొన్నారు.