
జైనూర్, వెలుగు : మండలంలోని షేకుగూడ శ్రీఆంజనేయ యూత్ సభ్యులు అదే గ్రామంలో ఓ పెళ్లికి సామగ్రి అందించారు. గ్రామంలో ఆత్రం విషంరావ్, గౌరుబాయి చిన్నప్పుడ్డే తల్లితండ్రులను కోల్పోయ్యారు. దీంతో వారు కులపెద్దల సమక్షంలో పెండ్లి చేసుకున్నారు. పెళ్లి ఖర్చులకు నగదుతో పాటు సరుకులను స్థానిక యూత్ సభ్యులు అందించారు. ఈ కార్యకర్రమంలో మెశ్రం నగేష్, మెశ్రం భీంరావు, తుంరం జలపాత్ రావు, దేవసావ్ రాజు, దేవు రావు, మెశ్రం రాజు, సుధాకర్, అడా సంతోష్ ఉన్నారు. వారిని గ్రామపెద్దలు అభినందించారు.