Pushpa 2: టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న అగ్రాన్డ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన 4 రోజుల్లోనే దాదాపుగా రూ.824 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో టాలీవడ్ ఓ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. యాక్షన్ సినిమాలని ఇష్టపడే హిందీ ప్రేక్షకులు పుష్ప 2 రిలీజ్ అయిన 4 రోజులోనే రూ.294 కోట్లు(నెట్) ఇచ్చేశారు.
ఐతే తాజాగా పుష్ప 2 సినిమా మేకర్స్ పై రాజ్పుత్ నాయకుడు రాజ్ షెకావత్ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇందులోభాగంగా సోషల్ మీడియాలోని ఓ వీడియోలో మాట్లాడుతూ ఈ సినిమాలోని భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర క్షత్రియ సమాజాన్ని అవమానించేలా ఉందని ఆరోపించాడు.
అంతేగాకుండా షెకావత్ పాత్రని నెగిటివ్ గా చూపించడంతో చాలామంది అవమానకరంగా ఫిల్ అవుతన్నారని కాబట్టి ఈ పదాన్ని తొలగించాలని మేకర్స్ ని హెచ్చరించాడు. లేదంటే క్షత్రియ సామజిక వర్గానికి చెందిన కర్ణిసేన తో పుష్ప 2 మేకర్స్ పై దాడి చేస్తామని బెదిరించాడు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఇప్పటివరకూ పుష్ప 2 ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ స్పందించలేదు.
ఐతే నార్త్ లో పుష్ప 2 మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అలాగే హిందీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో ఇది ఓర్వలేనటువంటి కొందరు కావాలనే ఇలా నెగిటివ్ ప్రచారాలు చేస్తున్నారు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు సెన్సార్ సభ్యులు చూసిన తర్వాతే పుష్ప 2 రిలీజ్ అయ్యిందని ఒకవేళ అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే వారే అడ్డుకునేవారని అభిప్రాయం వ్యర్థం చేస్తున్నారు. మరి ఈ విషయంపై పుష్ప మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.
पुष्पा 2 फ़िल्म मे “शेखावत” का नेगेटिव किरदार, फिर से क्षत्रियों का अपमान, तैयार रहे करणी सैनिक, जल्द फ़िल्म निर्माता की ठुकाई की जाएगी। @aajtak @ABPNews @ZeeNews @VtvGujarati @BBCBreaking @CNNnews18 @timesofindia @TimesNow @htTweets @EconomicTimes @FinancialTimes @JagranNews… pic.twitter.com/vsbm2r3OLL
— Dr. Raj Shekhawat (@IAMRAJSHEKHAWAT) December 8, 2024