సౌరాష్ట్ర బ్యాటర్/ వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని అతడు శుక్రవారం (జనవరి 3) ధ్రువీకరించాడు. 38 ఏళ్ల జాక్సన్ ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో డిసెంబర్ 31న తన చివరి మ్యాచ్ ఆడాడు. పంజాబ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 10 బంతుల్లో 13 పరుగులు చేశాడు.
జాక్సన్ పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో కొనసాగుతానని స్పష్టం చేశాడు. జాక్సన్ తన కెరీర్‌లో 86 లిస్ట్-ఎ, 84 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 84 ఇన్నింగ్స్‌ల్లో 2792 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 80 టీ20ల్లో 120 స్ట్రైక్ రేట్ తో 1812 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ALSO READ | Fact Check: ఛీ..ఛీ ఎంతకు తెగించార్రా.. జై షా- కావ్య పాపకు లింకెట్టేశారు
RCB, KKR
జాక్సన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆర్‌సీబీ, కేకేఆర్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ఆర్‌సీబీ తరుపున ఆడే అవకాశం రాకపోగా.. కేకేఆర్ తరుపున 9 మ్యాచ్‌ల్లో 61 పరుగులు చేశాడు.
📢 End of an Era: Sheldon Jackson Retires from White-Ball Cricket
— Doordarshan Sports (@ddsportschannel) January 3, 2025
Saurashtra’s stalwart Sheldon Jackson has announced his retirement from white-ball cricket, bringing down the curtains on a remarkable career in the shorter formats.
🏏 List A Stats
Matches: 84
Runs: 2,792… pic.twitter.com/En5KDoNIY1