రూ.2.19 కోట్లు వాపస్​ ఇప్పించాలి : కాపరులు

యాదాద్రి, వెలుగు : గొర్రెల కోసం తాము చెల్లించిన రూ.2.19 కోట్లు వాపసు ఇప్పించాలని కాపరులు కోరారు. ఈ మేరకు అడిషనల్​కలెక్టర్​బెన్​షాలోమ్ ను వారు కలిసి వినతిపత్రం అందజేశారు. రెండో విడతలో గొర్రెల కోసం ఒక్కొక్కరూ రూ.43,750 చొప్పున 500 మంది కాపరులు డబ్బులను డీడీల రూపంలో చెల్లించామని చెప్పారు. ఏడాది గడుస్తున్నా తమకు ప్రభుత్వం గొర్రెలు ఇవ్వలేదని తెలిపారు. గొర్రెల కోసం చెల్లించిన డబ్బు వాపస్​ ఇప్పించాలని కోరారు. 

ట్రిపుల్​ఆర్ ​అలైన్​మెంట్​ మార్చాలి

యాదాద్రి, వెలుగు : ట్రిపుల్​ఆర్ అలైన్​మెంట్​మార్చాలని రాయగిరికి చెందిన ట్రిపుల్​ఆర్​బాధితులు అధికారులను కోరారు. ఈ మేరకు యాదాద్రి అడిషనల్​కలెక్టర్​బెన్​షాలోమ్​ను ప్రజావాణిలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. ఇప్పటికే అభివృద్ధి పనుల కోసం నాలుగుసార్లు రాయగిరిలో భూములు ఇచ్చామని తెలిపారు. ఇప్పుడు మళ్లీ ట్రిపుల్​ఆర్​కోసం 240 ఎకరాలకుపైగా భూమి సేకరించడానికి గెజిట్​విడుదల చేశారని చెప్పారు. ఇప్పటికే భూములు ఇచ్చి నష్టపోయిన తాము మళ్లీ ఇవ్వడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. 

ప్రజావాణికి 59 అప్లికేషన్లు.. 

సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజలు 59 దరఖాస్తులు ఇచ్చారు. వాటిని పరిశీలించి వెంట వెంటనే పరిష్కరించాలని సంబంధింత ఆఫీసర్లకు అడిషనల్​కలెక్టర్ బెన్​షాలోమ్​​ ఆదేశించారు. వచ్చిన దరఖాస్తుల్లో భూములకు సంబంధించి 49 అప్లికేషన్లు రాగా, మిగిలినవి ఇతర డిపార్ట్​మెంట్లకు చెందినవి ఉన్నాయి. ప్రజావాణిలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఎం.ఎ. కృష్ణన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, కలెక్టరేట్​సూపరింటెండెంట్ పార్థసింహారెడ్డి, అధికారులు ఉన్నారు.