కాంగ్రెస్ లోకి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ : కండువా కప్పిన సీఎం రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ లోకి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ : కండువా కప్పిన సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్.. ప్రతి రోజూ షాక్ పై షాకులు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వరసపెట్టి జంప్ అవుతుండటంతో.. కేసీఆర్ కకావికలం అవుతున్నారు. నిన్నటికి నిన్న ప్రకాష్ గౌడ్ చేరారు. 2024, జూలై 13వ తేదీ ఉదయం.. హైదరాబాద్ సిటీ పరిధిలోని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో.. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 

హైదరాబాద్ సిటీ పరిధిలోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా చేజారుతుండటంతో.. కేసీఆర్, కేటీఆర్ చేతులెత్తేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చేరికతో హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ బలం అమాంతం పెరిగింది. మరికొంత మంది ఎమ్మెల్యేలు సైతం ఇదే బాటలో ఉండటంతో.. సిటీలోనూ బీఆర్ఎస్ ఖాళీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

అతి త్వరలోనే బీఆర్ఎస్ ఎల్పీ.. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేది సుస్పష్టంగా కనిపిస్తుంది. కుత్బుల్లాపూర్, సనత్ నగర్, ఎల్బీనగర్, కూకట్ పల్లి, ఉప్పల్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టిందంటున్నారు రాజకీయ పండితులు.