శెట్టి బలిజ భవన నిర్మాణానికి ఐదెకరాల స్థలం ఇవ్వాలె

శెట్టి బలిజ భవన నిర్మాణానికి ఐదెకరాల స్థలం ఇవ్వాలె

హైదరాబాద్: శెట్టి బలిజ కులాన్ని బీసీ–బీలో చేర్చాలని తెలంగాణ శెట్టి బలిజ సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుత్తుల మీరా కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూకట్‌పల్లి  శాతవాహన కాలనీలో  తెలంగాణ శెట్టి బలిజ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన గుత్తుల మీరా కుమార్ మాట్లాడారు. 15 రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తమ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో 15 లక్షలకు పైగా శెట్టి బలిజ జనాభా ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడంలేదని ఆరోపించారు. 

బీసీ బీలో చేర్చకపోవడం వల్ల తమ పిల్లలకు విద్యా, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుల సంఘం భవన నిర్మాణం కోసం హైదరాబాద్ లో ఐదెకరాల స్థలాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే స్పందించి శెట్టి బలిజ కులాన్ని బీసీ బీలో చేర్చాలని సంఘం నాయకులు గుత్తుల మీరా కుమార్,  కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.