ఆరె కులాన్ని ఓబీసీలో చేర్చండి..

ఆరె కులాన్ని ఓబీసీలో చేర్చండి..

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి నేతృత్వంలో కిషన్ రెడ్డి విజ్ఞప్తి 

రె కులాన్ని ఓబీసీలో చేర్చాలని, లేదంటే తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆ కుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శెట్టిపల్లి శివాజీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామితో కలిసి శెట్టిపల్లి శివాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. తమను ఆరె కులంలో చేర్చాలని కోరారు. వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి మేరకు  కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి వీరేంద్రకుమార్, ఆ శాఖ సెక్రటరీ సుబ్రమణ్యంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. ఆరె కులస్తుల సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరారు. 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది వరకూ ఆరె కులస్తులు ఉన్నారని శెట్టిపల్లి శివాజీ చెప్పారు. 2008 నుంచి తమను రాష్ట్రంలో బీసీ (డి)గా గుర్తిస్తున్నారని, కేంద్రంలో తమను ఓబీసీ జాబితాలో చేర్చలేదన్నారు. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కొల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరె కులస్తులను ఓబీసీ జాబితాలో చేర్చాలని భగవాన్ లాల్ శైని కమిషన్ కూడా కేంద్రానికి నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. తమ వినతిపై కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించారని శెట్టిపల్లి శివాజీ చెప్పారు. త్వరలోనే ఆరె కులస్తులకు న్యాయం చేసేలా చర్యలు ఉంటాయని తమకు హామీ ఇచ్చారని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసిన వారిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, ఆరె కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శెట్టిపల్లి శివాజీ ఉన్నారు. 

మరిన్ని వార్తల కోసం..

అమెరికాలో మంకీపాక్స్ ఫస్ట్ కేసు..వ్యాధి లక్షణాలివే

చనిపోయి బతికింది..ఐదుగురికి బతుకునిచ్చింది

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో తారల తళుకులు