ఎస్‌హెచ్‌జీ మాస్కులు రెడీ

ఎస్‌హెచ్‌జీ మాస్కులు రెడీ

ఆర్డర్ ఇచ్చి చేయిస్తున్న జీహెచ్ఎంసీ
ఫ్రీ డిస్ట్రిబ్యూషన్‌కు ఏర్పాట్లు
తయారీలో మహిళా సంఘాలు బిజీ

కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ లో భాగంగా జీహెచ్‌ఎంసీ ఎంప్లాయీస్, శాని టేషన్ కార్మికులతోపాటు ప్రజలకు ఫ్రీగా మాస్క్ లు పంపిణీ చేయాలని బల్దియా భావిస్తోంది. మార్కెట్లో డిమాండ్ బాగా ఉండడం, వ్యాపారులు రేట్లు పెంచడంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు తయారీ బాధ్యత అ ప్పగించింది. కుట్టుపనిలో పేరున్న సికింద్రాబాద్‌ వివేకానంద చౌక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలోని మహిళా సంఘాల సభ్యులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. మొదటి విడతలో 6 వేల మాస్క్‌లు ఆరర్ ఇచ్చారు. క్వాలిటీ, మోడల్ పరిశీలించి పెద్ద సంఖ్యలో పంపిణీ చేయనున్నారు. మహిళలకూ ఉపాధి స్వయం సహాయక బృందాల సభ్యుల్లో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి వారే. ఒక్కో గ్రూప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 10 మంది ఉంటారు. స్థానికంగా 20 గ్రూపులు యాక్టీవ్ గా ఉన్నాయి. వారిలో దాదాపు100 మందికి మిషన్లు ఉన్నాయి. వారందరినీ అధికారులు ఈ పనిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. అలా లాక్ డౌన్ టైమ్లో విమెన్స్‌కు ఉపాధి లభిస్తోంది.

ఇంట్లోనే తయారీ
కరోనా సేఫ్టీ ప్రికాషన్స్‌లో భాగంగా సిబ్బంది, ప్రజలకు ఇచ్చేందుకు పెద్దఎత్తున మాస్కుల్ని సమకూర్చు కుంటున్నాం . బయట మాస్క్‌ల కొరత ఉండడంతో తయారీ బాధ్యత సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌కు అప్పగించారు. ఇంట్లోనే మాస్కులు కుట్టి అందిస్తున్నారు.
– విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ యూసీడీ పీఓ

సగం ఆర్డర్లు కంప్లీట్ చేశాం
జీహెచ్‌ఎంసీ, మేడ్చల్, నిజాంపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్ అధికారులు మాస్కుల తయారీకి ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. ఇప్పటికే 6వేల
మాస్క్లు అందించాం. ప్రజలకు ఉపయోగపడే పని చేస్తు న్నందుకు, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌జీల్లోని మహిళలకు ఉపాధి కల్పిస్తున్నందుకు హ్యాపీగా ఉంది.
– పద్మావతి, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌జీ రిసోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్