Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. ధావన్‪కు అరుదైన గౌరవం

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ.. ధావన్‪కు అరుదైన గౌరవం

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(2025) ఈవెంట్ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఐసీసీ మొత్తం నలుగురిని ఈవెంట్ అంబాసిడర్లగా నియమించింది. వారిలో ధావన్ ఒకరు. 

ధావన్‌తో పాటు.. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ విజేత, పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్, న్యూజిలాండ్ వెటరన్ పేసర్ టిమ్ సౌతీలను ఈవెంట్ అంబాసిడర్లుగా ఐసీసీ నియమించింది.

ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగనుంది. ఆతిథ్యదేశం పాకిస్తాన్ అయినప్పటికీ, భారత జట్టు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. మిగిలిన మ్యాచ్‌లు పాకిస్తాన్‍లోనే. లాహోర్, కరాచీ, రావల్పిండి క్రికెట్ స్టేడియాలు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

Also Read :- హీటెక్కిన వార్.. సఫారీ బ్యాటర్‌పై దూసుకెళ్లిన పాక్ బౌలర్

ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20(గురువారం) బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా.. ఫిబ్రవరి 23(ఆదివారం) పాకిస్థాన్‌తో తలపడనుంది.