Shikhar Dhawan: ధావన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బ్యాట్ పట్టనున్న గబ్బర్

టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ అన్ని రకాల అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత ఫ్యాన్స్ ను ఖుషీ చేసే వార్త ఒకటి చెప్పాడు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో పాల్గొనాలనే తన నిర్ణయాన్ని ప్రకటించాడు. రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్లతో ధావన్ డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోనున్నాడు. 

"నా శరీరం ఇంకా క్రికెట్ ఆడేందుకు సహకరిస్తుంది. నా  నిర్ణయంతో సంతృప్తిగా ఉన్నాను. క్రికెట్ ను నా నుంచి విడదీయలేనిది. ఎప్పటికీ నా నుంచి వేరు కాదు". అని ధావన్ చెప్పుకొచ్చాడు. ధావన్ ఐపీఎల్ ఆడతాడా లేదా అనే విషయం మరికొన్ని రోజుల్లో తేలనుంది. పంజాబ్ కింగ్స్ అతన్ని రిటైన్ చేసుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే వేలంలోకి వస్తాడు.      2021లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ టీ20 టోర్నమెంట్‌ ప్రారంభమైంది. క్రిస్ గేల్, గౌతమ్ గంభీర్, షేన్ వాట్సన్ వంటి పలువురు సూపర్ స్టార్ క్రికెటర్‌లు ఈ లీగ్ లో ఆడారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్లు ఈ లీగ్ లో ఆడతారు. 

AALSO READ | Sanjay Bangar: కెప్టెన్‌గా కోహ్లీ.. ఈ జనరేషన్ టెస్ట్ జట్టును ప్రకటించిన సంజయ్ బంగర్

2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో వన్డేల్లో అరంగేట్రం చేసిన ధవన్‌‌‌‌.. 14 ఏళ్ల కెరీర్‌‌‌‌లో 167 మ్యాచ్‌‌‌‌లు ఆడాడు. 17 సెంచరీలు, 39 హాఫ్‌‌‌‌ సెంచరీలు సహా 6793 రన్స్‌‌‌‌ చేశాడు. 2022లో బంగ్లాదేశ్‌‌‌‌తో చివరి వన్డేలో పోటీపడ్డాడు.  2013లో మొహాలీలో  ఆసీస్‌‌‌‌పై టెస్టు అరంగేట్రం చేసిన ధవన్‌‌‌‌.. 2018లో ఇంగ్లండ్‌‌‌‌తో చివరి మ్యాచ్‌‌‌‌ ఆడాడు. 34 టెస్టుల్లో 2315 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 ఫిఫ్టీలు ఉన్నాయి. సగటు 40.61గా ఉంది. 2011లో వెస్టిండీస్‌‌‌‌పై తొలి టీ20 ఆడిన ధవన్‌‌‌‌ 68 మ్యాచ్‌‌‌‌ల్లో 27.92 సగటుతో 1759 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021లో శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్‌‌‌‌ ఆడాడు.