Nepal Premier League: ధావన్ పని బలే ఉందే.. నేపాల్‌లో గబ్బర్‌కు గ్రాండ్ వెల్కమ్

Nepal Premier League: ధావన్ పని బలే ఉందే.. నేపాల్‌లో గబ్బర్‌కు గ్రాండ్ వెల్కమ్

భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ టీమిండియాలో స్థానం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ కూడా గబ్బర్ ను ఎవరూ కొనకపోవడం విచారకరం. అయితే ధావన్ అతని ఫ్యాన్స్ కు ఒక కిక్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. నవంబర్ 30న ఖాట్మండులో ప్రారంభమయ్యే నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడనున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రశ్రేణి క్రీడాకారులు ఆడనున్నారు. డిసెంబర్ 21న ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. మ్యాచ్‌లు అన్ని త్రిభువన్ యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో జరుగుతాయి.

ఈ టోర్నీ కోసం ధావన్ నేపాల్ చేరుకోగా అక్కడ ఈ టీమిండియా మాజీ ఓపెనర్ కు గ్రాండ్ గా స్వాగతం పలికారు. అక్కడ సంప్రాదయాలతో గబ్బర్ ను బాగా రిసీవ్ చేసుకున్నారు. ధావన్ రాకతో ఒక్కసారిగా నేపాల్ ప్రీమియర్ లీగ్ కు భారీ హైప్ లభించింది. అతనికి అక్కడ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టు అర్ధమవుతుంది. భారత జట్టులో విజయవంతమైన ఒక ప్లేయర్ నేపాల్ ప్రీమియర్ లీగ్ ఆడడంతో అక్కడ క్రికెట్ పాపులర్ అవుతుందని భావిస్తున్నారు. 

ALSO READ | చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీపై నిర్ణయం నేటికి వాయిదా

లీగ్‌లో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు ఉంటాయి. ఖాట్మండు గూర్ఖాస్, చిత్వాన్ రైనోస్, బిరత్‌నగర్ కింగ్స్, జనక్‌పూర్ బోల్ట్స్, పోఖారా ఎవెంజర్స్, లుంబినీ లయన్స్, కర్నాలీ యాక్స్, సుదుర్పాశ్చిమ్ రాయల్స్ జట్లు ఈ లీగ్ ఆడతాయి. ఈ లీగ్ లో మొత్తం 32 మ్యాచ్‌లు మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ కు రిజర్వ్ డే ఉంటుంది. బెన్ కట్టింగ్, ఉన్ముక్త్ చంద్ , రవి బొపారా, చాడ్విక్ వాల్టన్, మార్చండ్ డి లాంగే వంటి పేరున్న ఆటగాళ్లు ఈ లీగ్ ఆడనున్నారు.