న్యూఢిల్లీ : ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్ఎల్సీ) పోటీపడనున్నాడు. ఈ మేరకు లీగ్‌లో చేరుతున్నట్టు సోమవారం తెలిపాడు. శనివారం కెరీర్‌కు వీడ్కోలు పలికిన 38 ఏండ్ల ధవన్ ఇప్పుడు ఐపీఎల్‌తో పాటు ఇతర టీ20 లీగ్స్‌లో పోటీ పడవచ్చు. ‘క్రికెట్‌ను నా నుంచి వేరు చేయలేను. దాని నుంచి నేను ఎప్పటికీ దూరంగా వెళ్లలేను.
నా శరీరం ఇప్పటికీ క్రికెట్ డిమాండ్లకు తగ్గట్టుగా ఉంది. నా క్రికెట్ ఫ్రెండ్స్‌తో తిరిగి ఒక్క చోటుకు చేరేందుకు, మేమంతా కలిసి అభిమానులను అలరిస్తూ కొత్త జ్ఞాపకాలను సృష్టించుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని ధవన్ పేర్కొన్నాడు. ఇండియా తరఫున ధవన్ 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20ల్లో పోటీ పడి 12 వేల పైచిలుకు రన్స్ చేశాడు. కాగా, లెజెండ్స్ లీగ్ క్రికెట్ సెప్టెంబర్‌లో జరగనుంది.