Shikhar Dhawan: ఆ ఇద్దరిలో ఒకరు నా బయోపిక్‌లో నటిస్తే చూడాలని ఉంది: శిఖర్ ధావన్

Shikhar Dhawan: ఆ ఇద్దరిలో ఒకరు నా బయోపిక్‌లో నటిస్తే చూడాలని ఉంది: శిఖర్ ధావన్

దశాబ్దకాలంగా టీమిండియా ఓపెనర్ గా భారత విజయాల్లో కీలక పాత్ర పోషించిన శిఖర్ ధావన్ తన అంతర్జాతీయ క్రికెట్ కు ఆదివారం (ఆగస్టు 25) రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు దేశీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ తో పాటు లెజెండ్స్ లీగ్ లో మాత్రమే గబ్బర్ కనిపించనున్నాడు. అయితే తాజాగా ధావన్ బయోపిక్ తెరపైకి వచ్చింది. తన బయోపిక్ గురించి ధావన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ లో ఎవరో ఒకరు తన బయోపిక్ లో నటిస్తే చూడాలని ఉందని చెప్పుకొచ్చాడు. 

ఒక షో లో పాల్గొన్న శిఖర్ మీ బయోపిక్ లో ఎవరు నటిస్తే బాగుంటుంది అనే ప్రశ్న ధావన్ కు ఎదురైంది. దీనికి ఈ మాజీ ఓపెనర్ స్పందిస్తూ అక్షయ్ కుమార్ లేదా రణ్‌వీర్ సింగ్‌కు లలో ఒకరు నా బయోపిక్ లో నటిస్తే చూడాలని ఉందని అన్నాడు. బాలీవుడ్ లో అక్షయ కుమార్ కు అన్ని రకాల పాత్రలు చేయగలడనే పేరుంది. మరోవైపు రణ్‌వీర్ సింగ్‌ ఇండియాలో అత్యంత ఎనర్జిటిక్ హీరో. ఇప్పటికే 83 అనే సినిమాలో కపిల్ దేవ్ పాత్రను ఇతను అద్భుతంగా పోషించాడని ప్రశంసలు దక్కాయి. 

Also Read :- ఇంగ్లాండ్ వరల్డ్ కప్ జట్టు ప్రకటన

2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో వన్డేల్లో అరంగేట్రం చేసిన ధవన్‌‌‌‌.. 14 ఏళ్ల కెరీర్‌‌‌‌లో 167 మ్యాచ్‌‌‌‌లు ఆడాడు. 17 సెంచరీలు, 39 హాఫ్‌‌‌‌ సెంచరీలు సహా 6793 రన్స్‌‌‌‌ చేశాడు. 2022లో బంగ్లాదేశ్‌‌‌‌తో చివరి వన్డేలో పోటీపడ్డాడు.  2013లో మొహాలీలో  ఆసీస్‌‌‌‌పై టెస్టు అరంగేట్రం చేసిన ధవన్‌‌‌‌.. 2018లో ఇంగ్లండ్‌‌‌‌తో చివరి మ్యాచ్‌‌‌‌ ఆడాడు. 34 టెస్టుల్లో 2315 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో 7 సెంచరీలు, 5 ఫిఫ్టీలు ఉన్నాయి. సగటు 40.61గా ఉంది. 2011లో వెస్టిండీస్‌‌‌‌పై తొలి టీ20 ఆడిన ధవన్‌‌‌‌ 68 మ్యాచ్‌‌‌‌ల్లో 27.92 సగటుతో 1759 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2021లో శ్రీలంకతో చివరి టీ20 మ్యాచ్‌‌‌‌ ఆడాడు.