Shikhar Dhawan: తోడు దొరికింది.. విదేశీ భామతో తిరుగుతోన్న గబ్బర్

పోషించే సత్తా ఉండాలే కానీ, ఒకటి.. రెండు.. మూడు.. అంటూ మనస్సుకు నచ్చిన వారినల్లా మనువాడే సమాజం మనది. అలాంటి మన భారతావనిలో కోట్లు కూడబెట్టిన ఆటగాడు.. ఒంటరి జీవితాన్ని అనుభవిస్తారా..! చెప్పండి.. అస్సలు ఊహించరానిది. అందుకు నిదర్శనం.. మన గబ్బర్ అలియాస్ శిఖర్ ధావన్. అవును నిజమేనండోయ్.. అయేషా ముఖ‌ర్జీతో విడాకుల అనంతరం కొన్నాళ్లు ఒంటరి జీవితాన్ని గడిపిన ఈ భారత మాజీ క్రికెటర్ ఎట్టకేలకు మరో తోడు వెతుక్కున్నాడు. 

అస‌లేం జ‌రిగిందంటే, ఇటీవల ధావ‌న్‌ ముంబై విమానాశ్రయంలో కెమెరావాళ్ల కంట ప‌డ్డాడు. ఇంకేముంది.. కెమెరాల‌న్నీ అతనివైపే వాలిపోయాయి. అంత‌లోనే ఓ మిస్టరీ గర్ల్ అతని కారులోంచి బయటకొచ్చింది. పింక్ కలర్ టీష‌ర్ట్, క‌ళ్ల‌ద్దాల‌తో త‌ళుక్కుమ‌న్న ఆ విదేశీ వ‌నిత అక్కడున్న వారికి అనుమానం రాకుండా కొంచెం ప‌క్కకు వెళ్లి నిల్చొంది. ధావ‌న్ కూడా ఆమెకు.. తనకూ ఏ సంబంధం లేదన్నట్టుగా యాక్ట్ చేశాడు. ఆ త‌ర్వాత ఇద్దరూ క‌లిసి విమానాశ్రయం లోప‌లికి వెళ్లారు. అంతే, వాళ్లిద్దరి ఎయిర్‌పోర్టు వీడియో నెట్టింట ప్రత్యక్షమయ్యింది.

Also Read:-ప్రీతి జింటాకు షాకిచ్చిన భారత పేసర్

ఆ వీడియో చూసిన‌వాళ్లంతా గ‌బ్బర్ మ‌ళ్లీ కొత్త జీవితం మొద‌లుపెట్టాడన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆ మిస్టరీ గర్ల్ ఎవ‌రనేది మాత్రం తెలియ‌లేదు. 

ఇద్దరు పిల్లలన్న అయేషా వివాహం

అప్పటికే భ‌ర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలన్న అయేషా ముఖ‌ర్జీని ధావన్.. 2012 అక్టోబ‌ర్‌లో వివాహమాడాడు. అందునా, వీరిది ప్రేమ వివాహం. ఈ జంటకు ఓ కుమారుడు కూడా జన్మించాడు.. పేరు జొరావ‌ర్. ఈ దంపతులపై ఎవరి కళ్లు పడ్డాయో కానీ, 9 ఏళ్ల త‌ర్వాత దాంప‌త్య జీవితంలో చీలికలొచ్చాయి. కలిసి బ్రతకలేమని నిర్ణయానికి వచ్చాక.. ఇద్దరూ  2021లో తమ విడాకుల విష‌యాన్ని బహిర్గతం చేశారు.. 2023లో ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం అయేషా కుమారుడు జొరావ‌ర్‌తో కలిసి ఆస్ట్రేలియాలో ఉంటోంది.

ఇక గబ్బర్ విషయానికొస్తే, ఈ మధ్యనే ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్‪కు వీడ్కోలు పలికాడు. టీమిండియా త‌ర‌ఫున విజ‌య‌వంత‌మైన ఓపెన‌ర్లలో ధావ‌న్ ఒక‌డు. ఓపెనర్‌గా ఈ లెఫ్ట్ హ్యాండ‌ర్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. శుభ్‌మ‌న్ గిల్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ వంటి యువ క్రికెటర్ల రాకతో గబ్బర్ ఆటకు దూరమవ్వాల్సి వచ్చింది.